తాట తీస్తోన్న "స్టార్"డమ్ ?
on Aug 24, 2017

డబ్బు చాలా మందికి ఉంటుంది..కానీ పేరు అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. వచ్చిన పేరు వూరకే ఉంటుందా.. పాత వారిని దగ్గర చేస్తుంది..కొత్త వారిని పరిచయం చేస్తుంది. ఎందుకంటే పేరున్న వాడి చుట్టూ జనం మూగడం మామూలే కదా..? అప్పటికి బాగానే ఉన్నా ఆ తర్వాత మొదలవుతాయి అసలు కష్టాలు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి పరిస్థితి కూడా ఇలాగే ఉందట. బాహుబలి పార్ట్ 1, 2లతో ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిపోయాడు రాజమౌళి.
ఆయన ఏం మాట్లాడినా..ఏం చేసినా లోకల్, నేషనల్ మీడియా ఫుల్ కవరేజ్ ఇస్తోంది. మరి ఇంత పేరున్న వాడిని సినీ జనాలు వదిలేస్తారా..? ఏ కొత్త సినిమా అయినా ఆయనతో ప్రారంభించాలనో..టీజర్‌ను రిలీజ్ చేయించాలనో..ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాలనో చాలా మంది తమకు తెలిసిన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇలా ఏదో ఒక పని మీద జక్కన్నను కలవడానికి వచ్చే వారితో ఆయన ఇంటి ముందు భారీ క్యూలు ఏర్పడుతున్నాయట. దీంతో రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులు కాస్తంత అసహనంతో ఉన్నారట. కానీ ఏం చేస్తాం అందరూ తెలిసిన వారు కావడంతో రాజమౌళి ఎవ్వరినీ కాదనలేకపోతున్నారట. దీంతో స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు, నిర్మాతల్ని తప్పించి ఎవరినీ కలవడం లేదంటూ ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న వారు జక్కన్నకి ఇప్పుడిప్పుడే ఈ కష్టాలు తీరేలా కనిపించడం లేదంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



