టీజర్ రివ్యూ: మహానుభావుడు
on Aug 24, 2017

ఈ ఏడాది ప్రారంభంలోనే "శతమానం భవతి" వంటి క్లాస్ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్.. కామెడీ ఎంటర్‌టైనర్స్ అందించే మారుతితో జత కలిసి చేస్తోన్న మూవీ మహానుభావుడు. టైటిల్ చూస్తే చాలా బరువైనది..మరి డైరెక్టర్‌కి అలాంటి సినిమాలు తీసిన అనుభవం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో ఎలాంటి సినిమా తీస్తారోనని ఎదురుచూస్తోన్న ప్రేక్షకుల డౌట్‌ను క్లారిఫై చేసేందుకు టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భలేభలే మగాడివోయ్‌లో మతిమరుపు హీరోతో విన్యాసాలు చేయించిన మారుతి..ఇందులో శర్వానంద్‌ను అతి శుభ్రత అనే డిజార్డర్ కలిగిన వ్యక్తిగా చూపించాడు. "ఆఫీసులో బాస్ తుమ్ముతుంటే కిలోమీటర్ దూరం పరిగెత్తి తుమ్మమనడం..గర్ల్‌ఫ్రెండ్ ముద్దిస్తుంటే బ్రష్ చేశావా" అని అడగటం ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచాయి. మరి మహానుభావుడి వేషాలు చూడాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే..యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా..శర్వానంద్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



