అజిత్ "వివేకం" ఫస్టాఫ్ రివ్యూ
on Aug 24, 2017

అజిత్-శివ కాంభినేషన్, టీజర్ నుంచి ట్రైలర్ వరకు భారీ అంచనాలు..ఇలా ప్రతి దానిలో ఆసక్తి రేపిన "వివేకం" వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. దాదాపు రెండేళ్ల నుంచి తలా సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించేందుకు అజిత్ వివేకంతో ముందుకు వచ్చారు. స్టంట్స్, మేకింగ్, ఇలా ఒకటేమిటి హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదనేలా వివేకంను తీర్చిదిద్దాడు శివ. ఇప్పటికే అమెరికా, గల్ఫ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడటంతో టాక్ బయటకు వచ్చింది.
వివేకం కోసం అజిత్ చాలా కష్టపడ్డాడు.. ఫిజిక్‌ని ఫిట్‌గా మలచడం, రిస్కీ స్టంట్స్ కోసం అంతా ఇంతా కష్టపడలేదు..ఆ కష్టమంతా స్కీన్ మీద కనిపించింది. ప్రపంచాన్ని నాశనం చేసే భయంకరమైన న్యూక్లియర్ వెపన్స్ కోసం వివేక్ ఒబెరాయ్. వాటిని విలన్లకు దొరక్కుండా చేసేందుకు అజిత్ మధ్య సాగే మైండ్‌గేమే ఈ సినిమా కథ. ఫస్టాఫ్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్‌తో నిండిపోవడంతో ఆడియన్స్ కాస్తంత బోర్ ఫిలయ్యారట. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందట. హీరోయిన్ కాజల్ తలా పక్కన బాగా సెట్ అయ్యిందట..అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు.. మరి విలన్ల ఎత్తులను అజిత్ చిత్తు చేశాడో లేదో తెలియాలంటే కొద్ది సేపు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



