విజయేంద్రప్రసాద్ రాజమౌళికి కథలు చెప్పడట
on Feb 28, 2017
ఎస్ఎస్. రాజమౌళి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. ఆయన ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది. అన్నింటికి మించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పాత్ర కీలకం. ఒకటి రెండు సినిమాలు తప్పించి రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అయితే ఒక రచయితగా పూర్తి కథను దర్శకుడికి చెప్పాల్సిన విజేంద్రప్రసాద్ నిజానికి అలా చెప్పారట. ఇదీ కథ అని చెప్పకుండా..ముందుగా పాత్రల్ని..వాటి నేపథ్యాన్ని వివరిస్తారట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఆయన పాత్రల గురించి చెప్పడంతోనే నా ప్రయాణం ప్రారంభమవుతుంది.. ఎప్పుడూ వాటి గురించే ఆలోచించి..వాటిని అంతే గొప్పగా వెండితెర మీద ప్రజెంట్ చేయాలని అనుకుంటానని జక్కన్న తెలిపారు.