చెర్రీ బద్దకం అందరినీ ముంచుతుందా..?
on Feb 28, 2017
మనిషికి ఏమైనా ఉండొచ్చు కానీ బద్దకం ఉండకూడంటారు పెద్దలు..ఒక్కసారి దాని చేతుల్లోకి చిక్కితే మనుషిని పాతాళానికి నెట్టేస్తుంది. ఇప్పుడు ఈ బద్దకం గుప్పెట్లో చిక్కుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. షూటింగ్ మొదలుపెట్టి వెనుక నుంచి తరుముతుంటే పనిలో పడిపోతాడు కానీ ఒకసారి గ్యాప్ వస్తే మాత్రం బద్ధకిస్తుంటాడని చెర్రీకి పేరుంది. అలా బద్ధకించడం వల్లే గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ చిత్రాలను కంగారు కంగారుగా తీసి ఫ్లాప్స్ ఖాతాలో వేసుకున్నాడు. జరిగిన అనుభవాల నుంచి రామ్‌చరణ్ గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి అన్నీ రెడీగా ఉన్నప్పటికీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. షూటింగ్ మొదలెడదాం రమ్మని సుకుమార్ చెర్రీకి ఎన్నిసార్లు కబురు పంపినా అటు నుంచి రెస్పాన్స్ లేదట. ఏవేవో కుంటిసాకులు చెప్పి షూటింగ్ పోస్ట్‌పోన్ అయ్యేలా చేస్తున్నాడట మెగాపవర్ స్టార్. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు మాట ఇచ్చిన రామ్‌చరణ్ ఆ మాటను పక్కనబెట్టి ఏడాదికి ఒకటే సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లున్నాడు.