ప్రభాస్ ఫాన్స్ కి ఒకే టికెట్ పై రెండు సినిమాలు
on Feb 28, 2017
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన నాలుగేళ్ళ జీవితం బాహుబలి కి వెచ్చించి మొత్తానికి ఆ సినిమా నుండి బయటకు వస్తున్నాడు. బాహుబలి పార్ట్ 2 ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 'కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు', దీనికి సమాధానం కోసం భారత దేశం మొత్తం ఎదురు చూస్తుంది. జక్కన్న తన సన్నిహితుల దగ్గర కూడా ఈ విషయంలో గోప్యం ప్రదర్శిస్తున్నాడని తెలిసింది. ముందే తెలిస్తే మజా ఏముంది, థియేటర్లలో చూడండి అనే సమాధానం ఇస్తున్నాడట.
ఏప్రిల్ 28 ప్రభాస్ ఫాన్స్ కి డబల్ ధమాకా అందనుంది. ఆ రోజు బాహుబలి 2 విడుదలవనుండగా, ప్రభాస్-సుజీత్ కాంబినేషన్లో వస్తున్న నూతన చిత్రం టీజర్ కూడా అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. బాహుబలి-2 ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ఈ టీజర్ కూడా వేస్తారని తెలిసింది. ఇంకో విశేషం ఏంటంటే, సినిమా షూటింగ్ కు ముందు గానే ఈ టీజర్ షూట్ చేస్తారని అంటున్నారు. సో, ప్రభాస్ ఫాన్స్ ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూస్తారన్నమాట!