కలెక్షన్స్ పెంచుకుంటూ పోతున్న అ ఆ..!
on Jun 9, 2016
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లయినా, బాక్సాఫీస్ పై వరసగా దండయాత్రలు చేసుకుంటూ వచ్చేసినా, నితిన్ కెరీర్లో ఇప్పటి వరకూ సరైన సూపర్ హిట్ పడలేదు. భారీ కలెక్షన్ సునామీ సృష్టించిన సంచలన సినిమా కూడా ఏమీ లేదు. ఆ లోటును అ ఆ పూర్తిగా తీర్చేసింది. త్రివిక్రమ్ సినిమా అనగానే ఉండే అంచనాలకు, పాజిటివ్ టాక్ యాడ్ అవడంతో మూవీ భారీ కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది. సినిమా ఒక 35 కోట్ల వరకూ వసూలు చేస్తుందని భావించిన ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తూ మొదటి వారంలోనే ఈ మార్క్ రీచ్ అయిపోయింది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం, సోమవారం 61,756 డాలర్లు కలెక్ట్ చేసిన అ ఆ, మంగళవారం మరింత పెరిగి 66,089 డాలర్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఓవర్సీస్ టోటల్ కలెక్షన్ 20 లక్షల డాలర్లను సమీపిస్తోంది. ఇప్పటికే నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని కన్ఫామ్ అయిపోయింది. టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ అ ఆ 60 కోట్ల వరకూ కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఏదేమైనా, మాంత్రికుల వారి మ్యాజిక్ మాత్రం బాగా పనిచేసిందండోయ్..!