సల్మాన్ అంటే పాకిస్థాన్ కు భయం..!
on Jun 8, 2016
మన సినిమాలు మన దేశంలో మాత్రమే రిలీజయ్యేది ఒకప్పుడు. ఇప్పుడు సినిమాకు ఎల్లలు లేవు. ప్రతీ సినిమా ప్రతీ దేశంలోనూ రిలీజవుతోంది. విదేశీ మార్కెట్ కూడా మనకు చాలా కీలకంగా మారిపోయింది. దక్షిణ పరిశ్రమ ఈ విషయంలో కాస్త వెనక ఉంటే, బాలీవుడ్ మాత్రం ఓవర్సీస్ ను ఏలుతోంది. బాలీవుడ్ కు పాకిస్థాన్ కూడా మంచి మార్కెట్. ముఖ్యంగా ముగ్గురు ఖాన్ లకు అక్కడ వీరాభిమానులున్నారు. సల్మాన్, షారుఖ్, అమీర్ సినిమాలు పాకిస్థాన్ లో కూడా కోట్లు కొల్లగొడుతుంటాయి. వీళ్ల ముగ్గరిలోనూ సల్మానే టాప్. ఆయన సినిమా వస్తోందంటే, అక్కడి రీజనల్ సినిమాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి.
రెజ్లింగ్ యోధుడిగా సల్మాన్ నటించిన సుల్తాన్ సినిమా కూడా ఇప్పుడు పాకిస్థాన్ సినిమాల్ని వణికిస్తోంది. జూలై 6న విడుదలవుతున్న సుల్తాన్ కోసం అక్కడ మంచి మంచి సినిమాలను కూడా వాయిదా వేసేశారు. ఏవో రెండు మూడు చిన్న సినిమాలు తప్పితే, పాక్ లో సుల్తాన్ కు తిరుగు లేదు. సల్మాన్ గత సినిమా భజరంగి భాయ్ జాన్ కూడా పాక్ లో మంచి వసూళ్లు సాధించింది. అక్కడ కీలకమైన రంజాన్ సీజన్లో విడుదలౌతున్న సుల్తాన్, పాకిస్థాన్ బాక్సాఫీస్ ను శాసిస్తాడని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.