పవన్ కళ్యాణ్ పైనే శ్రీలీల ఆశలు..!
on Nov 4, 2025

గ్లామర్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో.. స్టార్స్ పక్కన నటించే ఓ కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి. అయితే కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లతో వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. దీంతో ఇప్పుడామె తన ఆశలన్నీ పవన్ కళ్యాణ్ పైనే పెట్టుకుంది. (Sreeleela)
'పెళ్లి సందడి' వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీలీల.. ఆ తర్వాత 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా, వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే వాటిలో 'భగవంత్ కేసరి' తప్ప మిగతా సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ముఖ్యంగా గత మూడు చిత్రాలు 'రాబిన్‌హుడ్', 'జూనియర్', 'మాస్ జాతర' దారుణమైన రిజల్ట్ చూశాయి. దీంతో ఇక శ్రీలీల పనైపోయిందా? టాలీవుడ్ లో ఆమె మెరుపులు మూన్నాళ్ళ ముచ్చటేనా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటికి సమాధానం చెప్పి, తాను స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే.. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మ్యాజిక్ చేయాలి. (Ustaad Bhagat Singh)
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అసలే 'గబ్బర్ సింగ్' కాంబినేషన్, దానికి తోడు ఇటీవల 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని పవన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పైగా హరీష్ శంకర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు బాగానే ప్రాధాన్యం ఉంటుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అయ్యి, తన పాత్రకు మంచి పేరు వస్తే.. తెలుగులో శ్రీలీల టైం మళ్ళీ స్టార్ట్ అయినట్లే. చూద్దాం మరి 'ఉస్తాద్ భగత్ సింగ్'తో హిట్ అందుకుంటుందేమో.
Also Read: మరోసారి 'రాజా సాబ్' వాయిదా.. క్లారిటీ వచ్చేసింది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



