ఎన్టీఆర్ అలా.. మహేష్ ఇలా.. ఏం జరుగుతోంది..?
on Nov 4, 2025

ప్రజెంట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఉన్నారు. ఎన్టీఆర్ పేరు వింటే.. మాస్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ గుర్తుకొస్తాయి. అలాగే మహేష్ పేరు వింటే.. క్లీన్ షేవ్ తో హ్యాండ్సమ్ లుక్ గుర్తుకొస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు సరికొత్త లుక్స్ లో కనిపిస్తున్నారు.
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఐకానిక్ ఫిల్మ్ 'శివ' ఈ నవంబర్ 14న రీ-రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీల బైట్స్ తో కూడిన ప్రత్యేక ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్, మహేష్ లుక్స్ హాట్ టాపిక్ మారాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పైనే శ్రీలీల ఆశలు..!
ఎన్టీఆర్ తన గత కొన్ని చిత్రాల్లో కండల తిరిగిన దేహంతో పవర్ ఫుల్ గా కనిపించాడు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'డ్రాగన్' కోసం మాత్రం బాగా స్లిమ్ అయ్యాడు. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో కానీ.. శివ ట్రైలర్ వీడియోలో మాత్రం ఎన్టీఆర్ చాలా బక్కగా కనిపిస్తున్నాడు. మరీ ఇంత బక్కగా అవ్వడం వల్ల ఫేస్ లో కల పోతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో 28 సినిమాలు చేసిన మహేష్.. ఒక్కసారి కూడా గడ్డం, మీసాలతో కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మొదటిసారి లుక్ మార్చేశాడు. గడ్డం, మీసంతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. శివ ట్రైలర్ లోనూ ఈ కొత్త లుక్ తోనే దర్శనిమిచ్చాడు. దీంతో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



