సీరియల్ నటికి వేధింపులు.. నవీన్ అరెస్ట్
on Nov 4, 2025

-ఎవరు ఆ సీరియల్ నటి
-నవీన్ ఎవరు!
-అరెస్ట్ చేసిన పోలీసులు
ఆమె ఒక సీరియల్ నటి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లోను తన హవాని కొనసాగిస్తూ అప్రహాతీతంగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే ఆమెకి కొన్ని రోజుల క్రితం నవీన్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
కానీ సదరు నటి ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చెయ్యలేదు. అప్పట్నుంచి నవీన్ అసభ్యకరమైన మెసేజెస్ ని పంపిస్తు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. బ్లాక్ లిస్ట్ చేసినా వేరే అకౌంట్ ల ద్వారా మెసేజెస్ ని పంపిస్తు వస్తున్నాడు. దీంతో నటి ఎంతో మానసిక క్షోభ అనుభవించింది.ఇక చివరకి ఆ వేధింపులు భరించలేకబెంగుళూరు లోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదుతో నవీన్ ని గురించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.
Also Read: బిగ్ బాస్ పై మాధురి సంచలన వ్యాఖ్యలు.. హౌస్ నుంచి బయటకి వచ్చింది కదా
నటి ఎవరనే విషయాన్నీ మాత్రం పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు నటి ఎవరనే చర్చ జరుగుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



