రానా పెళ్లి వాయిదా వార్తలో నిజమెంత?
on Jun 11, 2020
ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ క్లోజ్ సిర్కిల్స్, రానా ఫ్రెండ్స్ తప్ప... మిహీకాతో రానా ప్రేమ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అందుకని, 'పడితినమ్మో నేను ప్రేమలోన పడితినమ్మో' పాట పట్టినట్టు 'షి సెడ్ ఎస్' అని రానా సోషల్ మీడియాలో చెప్పడంతో ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో చాలామంది షాక్ అయ్యారు. షాక్ నుండి తేరుకోకముందే ఆగస్టు 8న పెళ్లి అని తీపి కబురు చెప్పాడు. కరోనా కాలంలో ఇండస్ట్రీలో జరుగుతున్న శుభ పరిణామాల్లో ఇదొకటి. అయితే, ఆగస్టు 8న రానా పెళ్లి జరగడం లేదని, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేశారని నిన్నటికి నిన్న ఓ సెక్షన్ మీడియాలో ఓ వార్త షికార్లు చేసింది.
నిజంగా రానా పెళ్లి వాయిదా పడిందా? అందులో నిజమెంత? అని ఆరా తీయగా, ఆ వార్త వట్టి రూమర్ మాత్రమే అని తేలింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి, ఆగస్టు 8న పెళ్లి జరుగుతుందని దగ్గుబాటి ఫ్యామిలీ స్పష్టం చేసింది. ఈ నెల 15న అమ్మాయి (మిహీకా బజాజ్) కుటుంబ సభ్యుల నుండి లగ్న పత్రిక అందుకోనున్నామని తెలిపింది. సో... ఆగస్టు 8తో రానా బ్యాచిలర్ జీవితానికి ముగింపు పడుతుంది అన్నమాట.