రాజమౌళి ఇస్తుంటే ఆమె వద్దంది..!
on Oct 19, 2016
.jpg)
ఎస్ఎస్ రాజమౌళి...ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు. తీసిన ప్రతి సినిమా ఒక బ్లాక్‌బస్టరే. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. దేశంలోని బడా హీరోలు, చిత్ర నిర్మాణ సంస్థలు దర్శకధీరుడితో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఆయన మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అలాంటిది స్వయంగా జక్కన్న తన సినిమాలో నటించమని అడిగితే ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్.
భారతీయ చిత్ర పరిశ్రమను ప్రపంచం ముందు గర్వపడేలా చేసిన సినిమా బాహుబలి..ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కాసుల వర్షంతో పాటు ఈ సినిమాలో నటించిన నటినటులందరికి మంచి పేరు తీసుకువచ్చింది. అలాంటి వాటిలో ఒకటి అవంతిక పాత్ర. మిల్కీబ్యూటీ తమన్నా పోషించిన ఈ పాత్ర కోసం మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ని సంప్రదించారట. అయితే ఆమె ఆ ఆఫర్‌ని తిరస్కరించిందట. నేహా ధూపియా కొత్త చాట్ షో "నో ఫిల్టర్ విత్ నేహా"లో పాల్గొన్న సోనమ్ ఈ విషయాన్ని చెప్పింది. అంతేకాదు తాను ఇప్పటి వరకు ఆ సినిమాను చూడలేదని, ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు కొంచెం కూడా బాధ పడటంలేదని చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



