15 రోజుల్లో ప్రభాస్ పెళ్లి..
on Oct 19, 2016
.jpg)
ఆగండి ఆగండి మీరు ఏదేదో ఊహించుకోకండి. ప్రభాస్ పెళ్లి అంటే ఆ మాత్రం ఎంగ్జయిటి ఉండటం సహజం. ఆఫ్‌కోర్స్ టాలీవుడ్‌లోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున చెప్పే సమాధానం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పెళ్లిపై ప్రతిరోజూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడే ఏకంగా ఆయన పెళ్లినే టైటిల్‌గా పెట్టి ఒక సినిమా వస్తోంది. దాని పేరే "ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి". ఓ విలన్ ప్రేమ వైఫల్యాల నుంచి కథ ప్రారంభం అవుతుందట. కాలకేయ ప్రభాకర్ కీలకపాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్లు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ మొదటివారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ప్రభాస్ పెళ్లి చూసేందుకు మీరు రెడీనా..!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



