విద్యాబాలన్‌పై మర్డర్ కేసు..పోలీసుల గాలింపు
on Oct 19, 2016

బాలీవుడ్‌లో లేడి ఓరియేంటేడ్ పాత్రలకే కేరాఫ్‌గా నిలిచి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది..ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయండి అంటూ పోలీసులు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇది నిజ జీవితంలో కాదు..రీల్ లైఫ్‌లో. విద్య లీడ్ రోల్‌లో నటించిన కహానీ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు సైతం కొల్లగొట్టింది. కనిపించకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే కథతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇపుడు దీనికి సీక్వెల్‌గా కహానీ-2 తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను డిఫరెంట్‌గా విద్యాబాలన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. సో అదన్న మాట కథ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



