బాలకృష్ణ 106పై బాలీవుడ్ భామ ట్వీట్
on Dec 16, 2019
‘జై సింహా’ తర్వాత కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరోసారి నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా ‘రూలర్’. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. హీరోగా బాలకృష్ణకు ఇది 105వ సినిమా. దీని తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్‌లో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్లు ఎవరనే టాపిక్‌పై కూడా డిస్కషన్ జరుగుతోంది.
బాలకృష్ణ 106లో బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే... వాటిని ఆమె ఖండించింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ‘‘బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నేను నటిస్తున్న వార్తలు వచ్చాయి. ఈ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వార్తల్లో నిజం లేదు. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నేనే త్వరలో అనౌన్స్ చేస్తా’’ అని సోనాక్షి ట్వీట్ చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఇందులో శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. ఓ హీరోయిన్‌గా కేథరిన్ చేస్తుందని టాక్.