2022లో పెళ్లి చేసుకుంటా
on Dec 16, 2019
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ 2022లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడికి ఇంట్లో పెద్దలు పిల్లను వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... అతడు ప్రేమలో ఉన్నాడు. తన జీవితంలో ఓ అమ్మాయి ఉందని, తాను ప్రేమలో ఉన్నానని తాజా ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు.
ఓ సినిమా తర్వాత మరో సినిమా ‘అంధగాడు’, ‘రంగుల రాట్నం’, ‘రాజుగాడు’, ‘లవర్’ ఫ్లాపులు కావడంతో ఈ యువ కథానాయకుడు కొంత విరామం తీసుకున్నాడు. విరామం తర్వాత అతడు చేసిన సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘లవర్’ తర్వాత రాజ్ తరుణ్‌తో దిల్ రాజు నిర్మించిన సినిమా ఇది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి సంగతి చెప్పాడు.
'ఇద్దరి లోకం ఒకటే' సినిమా గురించి రాజ్ తరుణ్ మాట్లాడుతూ "స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. సినిమా అంతా ప్రేమే ఉంటుంది. టర్కీష్ సినిమా స్పూర్తితో చేశాం. అందులో ఎమోషన్స్‌ను మనకు తగినట్లు మార్చాము. సినిమా చివరి 30 నిమిషాలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. లోకాన్ని మరచిపోతాం" అన్నారు.