దిల్‌రాజు ఇలా... పవన్‌కల్యాణ్ అలా
on Dec 16, 2019
'పవర్ స్టార్ వచ్చేస్తున్నాడమ్మా.. త్వరలో! వెయిట్ చేయండి. మీకంటే ఎక్కువగా నా 20 ఇయర్స్ డ్రీమ్ అది. తొందరలో ఫుల్ ఫిల్ కాబోతోంది' అని 'ప్రతిరోజూ పండగే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్‌రాజు చెప్పారు. ఆల్రెడీ 'పింక్' రీమేక్ పనులను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. రెండు ట్యూన్స్ ఫైనలైజ్ అయ్యాయని టాక్.
నిర్మాతగా దిల్‌రాజుది మోస్ట్ సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, శర్వానంద్, నాగచైతన్య... ఈ జనరేషన్ హీరోల్లో చాలా మందితో సినిమాలు నిర్మించారు. అయితే... పవన్ కల్యాణ్ హీరోగా సినిమా నిర్మించాలనేది నా డ్రీమ్ అని ఎప్పటి నుండో చెబుతున్నారు. ఆ అవకాశం రావడంతో ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ 'పవన్ కల్యాణ్ సినిమా కోరిక తీరబోతోంది' అని చెప్పారు.
ఓ పక్క దిల్ రాజు ఇంత ధీమాగా, ధైర్యంగా చెబుతుంటే.... మరోపక్క పవన్ కల్యాణ్ ఈ సినిమా గురించి మౌనం వహిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'సినిమాల గురించి ఎందుకు?రాజకీయాల గురించి మాట్లాడదాం' అన్నారు. 'మళ్ళీ మీరు కెమెరా ముందు వచ్చేది ఎప్పుడు?' అని ప్రశ్నించగా... 'కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని అన్నారే తప్ప 'పింక్' రీమేక్ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అయితే సినిమా చేస్తానని దిల్ రాజుకు అభయం ఇచ్చారట. ఈ సినిమా కోసం పవన్ కి దిల్ రాజు 50 కోట్ల రూపాయలరెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఇండస్ట్రీ టాక్.