'కళావతి' సాంగ్‌కు సితార స్టెప్పులు!
on Feb 21, 2022

సూపర్‌స్టార్ మహేశ్, నమ్రతా శిరోద్కర్ ముద్దుల తనయ సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో చాలా మంది తెలుసు. తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అలరిస్తూ వచ్చే సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేటెస్ట్‌గా 'సర్కారువారి పాట'లో నాన్న మహేశ్ డాన్స్ చేసిన 'కళావతి' సాంగ్‌కు అదే తరహాలో డాన్స్ చేసి, దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది సితార. "My go at #Kalaavathi! This one's for you Nanna" అంటూ రాసుకొచ్చింది. అంతే కాదు, "Remix with me to the #KalaavathiChallenge. Would love to share my favourite ones on stories!!" అని కూడా చాలెంజ్ చేసింది.
సితార షేర్ చేసిన 'కళావతి' స్టెప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన స్టెప్‌ను సితార రిక్రియేట్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసి మురిసిపోయాడు మహేశ్.
పరశురామ్ డైరెక్ట్ చేసిన 'సర్కారువారి పాట'లో మహేశ్ జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్ సంగీతం సమకూర్చిన 'కళావతి' సాంగ్ యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన తెలుగు పాటగా రికార్డులు సృష్టించింది. మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



