ఐశ్వర్య దర్శకుడితో రజినీ సినిమా!?
on Feb 21, 2022

`రోబో` తరువాత ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయారు సూపర్ స్టార్ రజినీకాంత్. గత చిత్రం `అణ్ణాత్త` (తెలుగులో `పెద్దన్న`) అయితే తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో.. రజినీ నుంచి రాబోయే కొత్త సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో తన తదుపరి చిత్రం చేయబోతున్నారు సూపర్ స్టార్. `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమల్ హాసన్!
కాగా, తాజాగా మరో యువ దర్శకుడికి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. ఆ మధ్య టాలెంటెడ్ యాక్ట్రస్ ఐశ్వర్యా రాజేశ్ తో `కణా` (తెలుగులో `కౌసల్య కృష్ణమూర్తి` పేరుతో రీమేక్ అయింది) వంటి స్పోర్ట్స్ డ్రామాని రూపొందించిన అరుణ్ రాజా కామరాజ్ తో సూపర్ స్టార్ 170వ సినిమా ఉండనుందని సమాచారం. అంతేకాదు, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారని బజ్. త్వరలోనే రజినీ - అరుణ్ రాజా కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

అన్నట్టు.. గతంలో రజినీ నటించిన `కబాలి`, `కాలా` చిత్రాలకు గీత రచయితగా, గాయకుడిగా పనిచేశారు అరుణ్ రాజా. అలాగే నెల్సన్ తొలి సినిమా `కోలమావు కోకిల`కి సహాయ దర్శకుడిగానూ వర్క్ చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



