వైసీపీతో కలిసి త్రివిక్రమ్ గాడు పెద్ద ప్లాన్.. బండ్ల గణేష్ సంచలన ఆడియో లీక్
on Feb 21, 2022

పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ ఉందంటే ముందుగా గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. 'పవన్ కళ్యాణ్ నా దేవుడు' అంటూ స్టార్ రైటర్స్ కి కూడా సాధ్యం కాని డైలాగ్స్ తో స్పీచ్ అడగరగొడతాడు బండ్ల. అందుకే పవన్ ఫ్యాన్స్ బండ్ల స్పీచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈసారి బండ్ల స్పీచ్ ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బండ్ల ఫోన్ కాల్ ఆడియో ఒకటి లీకైంది. అందులో తనని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పవన్ ఫ్యాన్ తో బండ్ల మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో "బండ్లన్నా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నావా?" అని ఫ్యాన్ అడగగా.. "ఆ వెళ్తున్నాను" అని మొదట బండ్ల సమాధానం చెప్పాడు. ఆ తర్వాత 'స్పీచ్ రెడీ చేసుకున్నావా?' అని మళ్ళీ ఫ్యాన్ అడగగా.. "స్పీచ్ అయితే రెడీ చేశాను కానీ వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా.. త్రివిక్రమ్ గాడు రావొద్దు అన్నాడంట, వాడు డౌన్ అవుతాడని. అదే ఆలోచిస్తున్నాను. నాకేమో వెళ్ళాలని ఉంది. మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నాను అద్భుతంగా." అని బదులిచ్చాడు.
"పిలవకపోయినా వెళ్ళిపో అన్నా" అని ఫ్యాన్ అనడంతో.. "అలా వెళ్తే బాగోదమ్మా. త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో పెద్ద ప్లాన్ చేసుకున్నాడు అదీ బాధ" అని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. "నిన్ను చాలా మిస్ అవుతాం అన్న" అని ఫ్యాన్ అనడంతో.. "అందరూ గట్టిగా అరవండి. నేను అక్కడే ఉంటాను. బండ్లన్న రావాలి బండ్లన్న రావాలి అని గట్టిగా అరవండి నేను వెంటనే వచ్చేస్తాను" బండ్ల చెప్పినట్లుగా ఆడియోలో ఉంది.
త్రివిక్రమ్ పై బండ్ల చేసిన సంచలన వ్యాఖ్యల ఆడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు ఈ ఆడియో నిజామా కాదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అందులో వాయిస్ మాత్రం బండ్ల వాయిస్ లాగే ఉంది. మరి ఇది ఎవరైనా మిమిక్రీ చేశారా లేక నిజంగా బండ్ల వాయిసేనా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈరోజు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆయనకు సంతాపంగా ఈవెంట్ వాయిదా వేయాలని మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



