మహేష్ 'సరిలేరు...'లో ఆమె విధవరాలు
on Jan 4, 2020
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు కొంతసేపు సైనికుడిగా కనిపిస్తారు. సైనికుల త్యాగాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. దేశ భద్రత కోసం సైనికులు ఎన్నో కష్టాలు పడుతుంటే... దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న కొందరిని చూసి మహేష్ ఏం చేశాడన్నది సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. షుగర్ కోటెడ్ పిల్ టైపులో సీరియస్ కాన్సెప్ట్ కి దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ పూత పూశారట.
సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించారని, మంచి ఎమోషనల్ సీన్స్ పడ్డాయని సెన్సార్ టాక్. ఇందులో యాంకర్, సింగర్ కౌముది విధవరాలి పాత్ర పోషించారు. విజయశాంతి కుమార్తెగా ఆమె కనిపించనున్నారు. ఇంతకు ముందు 'రారండోయ్ వేడుక చూద్దాం', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాల్లో నటించారు. 'భరత్ అనే నేను' తర్వాత మహేష్ బాబుతో మరోసారి ఈ సినిమాలో నటించారు. విజయశాంతి, మహేష్ కాంబినేషన్లో కౌముది సీన్స్ ఎమోషనల్ గా వచ్చాయట. ఈపాత్రలో నటించడం వలన జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనేది తెలుసుకున్నానని కౌముది తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
