బిజినెస్‌లోకి అమలా పాల్?
on Jan 4, 2020

కథానాయికగా కాస్త క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఒకప్పుడు ఆలోచించేవారు. ఈ తరం ఆలోచించే విధానం మారింది. కథానాయికగా కాస్త క్రేజ్ ఉన్నపుడే... ఆ క్రేజ్ తగ్గిన తర్వాత కూడా నాలుగు రాళ్లు వెనకేసుకొనే మార్గాలను వెతుకుతున్నారు. ఏదో ఒక వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సిస్టర్ షగున్ పన్నుతో కలిసి తాప్సి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. కాజల్ అగర్వాల్, తమన్నా నగల వ్యాపారంలో ఉన్నారు. ఈ జాబితాలోకి అమలా పాల్ కూడా త్వరలో చేరుతోందని తెలుస్తోంది.
అమలా పాల్ బిజినెస్‌లోకి ఎంటర్ కానుందని కోలీవుడ్ టాక్. ట్రావెల్ రిలేటెడ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేయాలని అమలా పాల్ ప్లాన్ చేస్తోందట. ఆమెకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడడమే కాదు... అప్పుడప్పుడూ డివోషనల్ ట్రిప్స్ కూడా వేస్తుంటుంది. ఆమెలా ట్రావెలింగ్ ఇష్టపడేవాళ్ళ కోసం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుందట. మనసుకు స్వాంతన చేకూర్చడమే ఈ కంపెనీ ప్రధాన ఉద్దేశమట. ప్రజెంట్ తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తుందీ హీరోయిన్. తెలుగులో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



