శింబు నడిగర్ సంఘాన్ని వదలి వెళ్లద్దు..!
on Apr 22, 2016
వివాదాస్పద తమిళ నటుడు శింబు, నడిగర్ సంఘం తాను బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదని, అందుకు సభ్యత్వానికి రాజీనామా చేయానుకుంటున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్ స్పందించారు. సంఘం నుంచి శింబు బయటికెళ్లడం తమకు ఇష్టం లేదని విశాల్ వ్యాఖ్యానించారు. శింబు మాత్రమే కాదు, ఏ సభ్యుడు బయటికి వెళ్లినా తమకు ఇష్టం లేదని, వీలైనంత న్యాయం చేయడం కోసమే సంఘం ఉందని విశాల్ అన్నారు. నిజానికి బీప్ సాంగ్ వివాదం సమయంలో, తాము శింబు తండ్రి టి రాజేందర్ ను కలిశామని, సమస్యను చట్టరీత్యా ఎదుర్కొంటామని వారు చెప్పడంతోనే నడిగర్ సంఘం ఈ విషయంలో తలదూర్చలేదని నాజర్ అన్నారు. ఈ నెల 24న జరగబోయే కార్యవర్గ సమావేశంలో అందరితో చర్చించి ఆ తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని, తమకు శింబు డైరెక్ట్ గా ఏమీ చెప్పలేదని, తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని నాజర్ చెప్పడం విశేషం. శింబును వెళ్లకుండా ఆపడానికే ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. నాజర్, విశాల్ వ్యాఖ్యలకు శింబు స్పందించాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
