ఆ రెండు తప్పులకు బాధపడుతున్న శ్రియ
on Dec 30, 2013
టాప్ హీరోయిన్ స్థానం నుండి ప్రస్తుతం సినిమా ఛాన్సులు కూడా రాని పరిస్థితికి పడిపోవడానికి కారణం ఆ రెండు తప్పులే అని అంటుంది హీరోయిన్ శ్రియ. ఇటీవలే ఓ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రియ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తను ఇలా అయిపోవడానికి కారణాన్ని వివరించింది. "కెరీర్ మంచి స్పీడ్ లో ఉన్న సమయంలో ఐటెం సాంగ్ చేసి పెద్ద తప్పు చేశాను. బాలీవుడ్ హీరోయిన్లందరు కూడా ఐటెం సాంగ్స్ చేసి, వారి కెరీర్ మరింత పెంచుకుంటున్నారు. మనం కూడా అలా చేస్తే తప్పేంటి అనుకొని... "మున్నా"లో ఐటెం సాంగ్ చేశాను. ఏ ముహూర్తాన ఆ పాట చేసానో కానీ, ఆ తర్వాత నాకు అలాంటి సాంగ్స్ రావడమే మొదలయ్యాయి. కానీ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కూడా అవి పెద్దగా ఆడలేవు. ఆ తర్వాత "కాల్ గర్ల్" పాత్రలు చేస్తూ చాలా మంది హీరోయిన్లు టాప్ ప్లేస్ లోకి చేరుకున్నారు. అలాగే నాక్కూడా విజయం దక్కుతుందనుకున్న "పవిత్ర" సినిమా ఫ్లాప్ అయ్యింది. దీని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా అవకాశాలే రావడం ప్రారంభం అయ్యాయి. అందుకే ఈ రెండు తప్పులు నా కెరీర్ ను మరింత పాడు చేసాయి. ఈ రెండు తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరే విధంగా ఉండేది." అంటూ తన మనసులోని మాటను తెలియజేసింది.