శ్రియకు పదేళ్ల కూతురు!
on Jun 8, 2019

శ్రియకు పెళ్ళై పట్టుమని రెండేళ్లు కూడా కాలేదు. ఆమెకు పిల్లలు లేరు. తల్లి కాలేదు. కానీ, వెండితెరపై తల్లిగా నటించడానికి శ్రియ ఎప్పుడూ వెనుకాడలేదు. 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'గోపాల గోపాల' సినిమాల్లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. ఇప్పుడు మరోసారి తల్లి పాత్రలో నటించడానికి శ్రియ సిద్ధమవుతున్నారని సమాచారం. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'సాహసం', 'మనసంతా' సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఇటీవల ఆయన శ్రియకు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కథ చెప్పారట. ఓ పదేళ్ల కుమార్తె, ఆమె తల్లి చుట్టూ కథ తిరుగుతుందట. స్క్రిప్ట్ నచ్చడంతో పదేళ్ల కుమార్తెకు తల్లిగా నటించడానికి శ్రియ అంగీకరించారని ఫిలిం నగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



