శ్రియకు కూతురు పుట్టింది.. బయటపెట్టకుండా సంవత్సరం పాటు దాచింది!
on Oct 11, 2021
శ్రియ, ఆమె భర్త ఆంద్రీ కొశ్చెవ్ తమకు కూతురు పుట్టిందనే బిగ్ న్యూస్‌ను ఇండస్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్, గమనం సినిమాల్లో కనిపించబోతున్న శ్రియకు పండండి పాప జన్మించింది. అవును. 2020లో ప్రపంచమంతా కొవిడ్ కారణంగా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న సందర్భంలో, లిటిల్ ఏంజెల్ రాకతో తన ప్రపంచం మారిపోయిందని ఆమె వెల్లడించింది. అయితే ఏడాది కాలంగా ఆ విషయాన్ని బయటపెట్టకుండా దాచి, ఇప్పుడు ఆ సంతోషకర వార్తను ప్రపంచానికి తెలియజేసింది.
"హలో పీపుల్, మాకు 2020 క్వారంటైన్ క్రేజీగా, కానీ బ్యూటిఫుల్‌గా గడిచింది. ప్రపంచమంతా ఓ అందమైన గందరగోళంలో ఉన్నప్పుడు, మా ప్రపంచం ఎప్పటికీ మారిపోయింది.. మా ప్రపంచం అడ్వంచర్స్, ఎక్సయిట్మెంట్, లెర్నింగ్‌తో నిండిపోయింది. మా జీవితాల్లో ఒక ఏంజెల్ రాకతో ఆశీర్వదించబడ్డాం. మేం దేవునికి చాలా రుణపడివున్నాం" అని రాసుకొచ్చింది శ్రియ. దాంతో పాటు పాపను ఎత్తుకొని ఆడిస్తున్న ఒక వీడియోను ఆమె షేర్ చేసింది.
కొవిడ్ 19 కారణంగా శ్రియ, ఆంద్రీ కొశ్చెవ్ బార్సిలోనాలో చిక్కుబడిపోయారు. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చిన ఆ జంట, ముంబైలో కొత్త ఇంటికి మారారు.
Also Read