ENGLISH | TELUGU  

చిరంజీవి నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

on Oct 11, 2021

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఊహించని విధంగా 'మా'లో సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నాగబాబు, ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఈ క్రమంలో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. నాగబాబు, ప్రకాష్ రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదని స్పష్టం చేశారు.

మంచు విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో విత్‌ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని తెలిపారు. ఏకగ్రీవం చేసేందుకు ఆయన తనను పోటీ నుండి తప్పుకోమన్నారని చెప్పారు. మా నాన్న వల్లే తాను అధ్యక్షుడిగా గెలిచానని.. నాన్న మీద నమ్మకంతోనే సభ్యులు తనకు ఓటేశారని అన్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు. ఓటు వేసినవారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మా ప్యానల్‌ లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరమన్న విష్ణు.. ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌ లో గెలిచిన వారిని కలుపుకొని పోతామని, తామంతా ఒక్కటేనని అన్నారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని విష్ణు కోరారు. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే అని చెప్పిన విష్ణు.. మా అధ్యక్ష స్థానంలో ఉన్న తాను ఆయన రాజీనామాను ఆమోదించనని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్‌ రాజీనామాను కూడా ఆమోదించనని పేర్కొన్నారు. ఆయన సలహాలు సూచనలు మాకు కావాలన్నారు. త్వరలోనే ఇద్దరినీ కలిసి మాట్లాడతానని విష్ణు చెప్పారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.