శ్రియ ప్రేమకు పునాది ఎక్కడ పడిందంటే?
on Dec 24, 2019

సినిమా కబుర్లు తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి శ్రియ పెద్దగా ఇష్టపడడు. సో... ఆమె పర్సనల్ టాపిక్స్ పెద్దగా బయటకు రావు. రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రూ కొశ్చీవ్‌తో శ్రియ వివాహమై ఏడాదిన్నర కావొస్తుంది. ఇప్పటివరకు భర్త గురించి పెద్దగా చెప్పింది లేదు. అసలు, వీళ్ళిద్దరూ ఎక్కడ ప్రేమలో పడిందీ ఎవరికీ తెలియదు. తొలిసారి ఎక్కడ కలిసిందీ ఎవరికీ చెప్పలేదు. రీసెంట్‌గా ఆ విషయాలు బయటపెట్టింది శ్రియ.
శ్రియతో పాటు భర్తకు స్కూబా డైవింగ్ అంటే బాగా ఇష్టమట. మూడేళ్ళ క్రితం స్కూబా డైవింగ్ చేయడానికి శ్రియ మాల్దీవులు వెళ్ళింది. అక్కడ తొలిసారి ఆండ్రూ కొశ్చీవ్‌ను కలిసింది. ఇద్దరు అభిరుచులు కలవడంతో చాలాసేపు మాట్లాడుకున్నారు. అలా వాళ్ళ ప్రేమకథకు అక్కడ పునాది పడింది. అదీ సంగతి. పెళ్లి తర్వాత కూడా శ్రియ సినిమాలు చేస్తున్నారు. తనకు భర్త నుండి పూర్తి మద్దతు ఉందని, తాను పని చేయడం భర్తకు ఇష్టమని శ్రియ చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



