వరుణ్ తేజ్ సరసన సల్మాన్ హీరోయిన్?
on Dec 24, 2019
మెగా హీరో వరుణ్ తేజ్‌కు 2019 మంచి విజయాలు అందించింది. సంక్రాంతికి వెంకటేష్‌తో కలిసి అతడు నటించిన 'ఎఫ్ 2' వందకోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే, 'ఎఫ్ 2' హీరోలు ఇద్దరూ కలిసి హాలీవుడ్ సినిమా 'అలాద్దీన్'కి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత 'గద్దలకొండ గణేష్'తో వరుణ్ మాస్ సినిమాలు కూడా చేయగలనని పేరు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ స్క్రిప్ట్స్, జానర్లు ట్రై చేస్తూ ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
జనవరిలో వరుణ్ తేజ్ స్పోర్ట్స్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో అతడు బాక్సర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం అమెరికా వెళ్లి బాక్సింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇందులో అతడి సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుందని ఫిలింనగర్ టాక్. ఈమె హిందీ నటుడు, తెలుగులోనూ సినిమాలు చేసిన మహేష్ మంజ్రేకర్ కుమార్తె. ఇటీవల విడుదలైన 'దబాంగ్ 3'తో ఈమెను సల్మాన్ ఖాన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. తెలుగులో వరుణ్ తేజ్ సినిమాలో సాయి మంజ్రేకర్ నటించే అవకాశాలు ఉన్నాయట. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాతో ఆయన పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
