పునీత్‌కు డబ్బింగ్ చెప్పిన శివన్న!
on Feb 3, 2022

పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా 'జేమ్స్'లో ఆయన పాత్రకు అన్నయ్య శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం 'వేద' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తమ్ముని కోసం వెసులుబాటు కల్పించుకొని మరీ బుధవారం డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారు శివన్న. కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధిని సందర్శించిన మీడియాతో మాట్లాడుతూ, "నా తమ్ముని ఫిల్మ్‌కు డబ్బింగ్ చెప్పడం అనేది భావోద్వేగంతో కూడుకున్న అంశం. తెరపై అప్పును చూస్తూ, డబ్బింగ్ చెప్పడం నాకు చాలా క్లిష్టంగా అనిపించింది. పైగా అతని వాయిస్‌తో నా వాయిస్‌ను మ్యాచ్ చేయడం డిఫికల్ట్ కూడా. డబ్బింగ్ చెప్పడానికి నాకు రెండున్నర రోజులు పట్టింది. నాకు సాధ్యమైన మేర ప్రయత్నించాను. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను." అని చెప్పారు. Also read: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్!
చేతన్ కుమార్ డైరెక్ట్ చేసిన 'జేమ్స్' మూవీ పునీత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మార్చి 17న విడుదలవుతోంది. కన్నడ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, షైన్ శెట్టి, తిలక్, చిక్కన్న కీలక పాత్రలు చేశారు. పునీత్ గౌరవార్ధం 'జేమ్స్' విడుదలైన వారం మొత్తం థియేటర్లలో ఆ సినిమా ఒక్కదాన్నే ఆడించాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. Also read: 'పుష్ప' లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది.. గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



