ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తున్నాను!
on Feb 3, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ #NTR30 లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటించనుంది అంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఆలియా క్లారిటీ ఇచ్చింది. తాను ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నానని చెప్పేసింది.
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన 'గంగూబాయ్ కథియవాడి' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆలియా.. తాను మరో తెలుగు సినిమాకి సైన్ చేసినట్లు తెలిపింది. "డైరెక్టర్ కొరటాల శివ వచ్చి స్టోరీ చెప్పగానే, ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చేశానని.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మరోసారి తారక్ తో కలిసి పనిచేయబోతున్నానని" ఆలియా చెప్పుకొచ్చింది.
కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా నటించిన సంగతి తెలిసిందే. మార్చి 25 న విడుదల కానున్న ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కి జోడీగా నటించింది. ఇప్పుడు కొరటాల సినిమాలో తారక్ సరసన సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



