నాని తన సినిమాను తానే ఆపుకున్నాడా..?
on Jan 25, 2017
.jpg)
రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని..గతేడాది ఆయన నటించిన మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అదే స్పీడులో నేను లోకల్ అంటూ నాలుగో సినిమాను కూడా రిలీజ్ చేసేవాడు కానీ పరిస్థితుల కారణంగా డిసెంబర్‌లో రిలీజవ్వాల్సిన ఆ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఆ సినిమా విడుదల అవ్వకపోవడానికి పలానా కారణం అంటూ ఏదీ తెలియరాలేదు..కానీ ఈ మూవీ ఆలస్యం కావడానికి నానీనే కారణమంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
ఆ సినిమా క్లైమాక్స్ నానికి ఏ మాత్రం నచ్చలేదట..దీంతో దానిని మళ్లీ రాయమని రైటర్ ప్రసన్న కుమార్‌కు చెప్పాడట...అయితే ఆయన సైడ్ నుంచి వ్యతిరేకత వచ్చింది..చివరకు ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా ప్రసన్నకే సపోర్ట్ చేశాడట..అదే ప్రసన్న కుమార్ రాసిన నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్ బోల్తాకొట్టడంతో కంగారుపడిన చిత్ర యూనిట్ నాని చెప్పినట్లుగా క్లైమాక్స్ రీ షూట్ చేస్తున్నారట..దీని కారణంగానే నేను లోకల్ రిలీజ్ డేట్ ఫిబ్రవరికి మారిందని ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



