గూగుల్ సీఈవోగా నటసింహం?
on Jul 5, 2021

వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించే అగ్ర కథానాయకుల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. త్వరలో `అఖండ` కోసం అఘోరా వేషంలో దర్శనమివ్వనున్న బాలయ్య.. మరో కొత్త చిత్రంలో గూగుల్ సీఈవోగా కనిపించనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `డిక్టేటర్` (2016) తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. కళాశాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలకృష్ణ లెక్చరర్ గా నటించనున్నారంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ చిత్రం కార్పోరేట్ రాజకీయాల నేపథ్యంలో సాగుతుందట. ఓ చిన్న ఊరి నుంచి గూగుల్ లాంటి కంపెనీకి సీఈవో అయ్యే ఓ వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కనుందట. తను సంపాదించిన జ్ఞానాన్ని, సంపాదనని.. తన గ్రామానికి, తన దేశానికి పంచివ్వాలనుకుంటే ఏం జరిగింది? అనే పాయింట్ తో ఈ యాక్షన్ డ్రామా రూపొందనుందట.
బాలయ్యతో `జై సింహా` (2018) వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సి. కళ్యాణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరి.. ఈ కొత్త తరహా పాత్రలో బాలయ్య ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



