సమ్మర్ లో 'సరసాలు చాలు'!
on Dec 29, 2021

నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'సరసాలు చాలు'. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేయగా.. చిత్ర నిర్మాత సతీమణి శృతి రెడ్డి హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు. నిర్మాత చంద్రకాంత్ రెడ్డి ,రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లూజర్ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుండి సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో సందీప్ చెప్పిన కథ నచ్చి ఈ మూవీ చేస్తున్నాను. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాము. ఇక ముందు మా బ్యానర్లో ఇలాంటి మంచి సినిమాలు చేస్తాము" అని అన్నారు
చిత్ర దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ.. " 'ఒక చిన్న విరామం' సినిమా తర్వాత వస్తున్న నా రెండవ సినిమా 'సరసాలు చాలు'. పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ ఎంటర్ టైనర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఇందులో కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. ఈ సినిమాను మూడు షెడ్యూల్లో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



