ముసలి గెటప్‌లో కొడుకును చూసి షాకైన రాహుల్ తండ్రి! ఎందుకంటే..
on Dec 29, 2021

'శ్యామ్ సింగ రాయ్' మూవీలో శ్యామ్ చిన్నన్న మనోజ్ సింగ రాయ్ క్యారెక్టర్‌లో కనిపించిన రాహుల్ రవీంద్రన్ మరచిపోలేని క్షణాలను ఎక్స్‌పీరియెన్స్ చేశాడు. ఆ మూవీ క్లైమాక్స్‌లో కోర్టు రూమ్‌కు వచ్చిన ఓ ముసలి వ్యక్తిని చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ప్రేక్షకులు సైతం అతను మనోజ్ పాత్రధారి రాహుల్ రవీంద్రన్ అనే విషయం గ్రహించి షాకవుతారు. మనల్నే కాదు, తన తండ్రిని కూడా షాక్‌కు గురిచేశాడు రాహుల్.
Also read: ఆంధ్రప్రదేశ్‌లో 'ఆర్ఆర్ఆర్'కు మినహాయింపులు లేవు.. బెంబేలెత్తుతున్న బయ్యర్లు!
ఈ విషయాన్ని రీసెంట్‌గా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్ ద్వారా వెల్లడించాడు రాహుల్. ముసలి గెటప్‌తోటే అతను తన తండ్రికి వీడియో కాల్ చేశాడు. ఆ సందర్భంగా ఎదురుగా ఫోన్‌లో కనిపిస్తున్న ముసలి వ్యక్తిని చూసి రాహుల్ తండ్రి మొదట షాకయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన కొడుకు రాహుల్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. దీనికి కారణం.. ఆ ముసలి గెటప్‌లో ఉన్న రాహుల్.. అచ్చుగుద్దినట్లు తన తండ్రిలాగా ఉండటం! అంటే రాహుల్‌కు తన తాత పోలికలు వచ్చాయన్న మాట.
Also read: సమంతా.. నువ్వు నా హృదయాన్ని గెలిచావ్! బన్నీ మాటకు సామ్ రెస్పాన్స్ ఇదే!!
ఆ వీడియో కాల్ ఫొటోతో పాటు, 'శ్యామ్ సింగ రాయ్'లో తన ముసలి గెటప్ ఫొటోలు, తన ఇప్పటి ఫొటోను షేర్ చేసిన రాహుల్, "ఇది అమూల్యం. 'శ్యామ్ సింగ రాయ్'లోని ప్రాస్తటిక్ లుక్‌తో మా నాన్నకు వీడియో కాల్ చేశాను. తన తండ్రిలాగే ఉన్న కొడుకును చూసిన ఆయన షాకయ్యారు. అవును. ఈ మేకప్ చేసిన ముంబై టీమ్‌కు బిగ్ థాంక్స్." అని రాసుకొచ్చాడు రాహుల్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



