`రాధే శ్యామ్`తోనే తమన్ కి ఫస్ట్ టైమ్!
on Dec 29, 2021

`మిరపకాయ్` (2011), `బిజినెస్ మేన్`, `బాడీగార్డ్` (2012), `నాయక్` (2013), `డిక్టేటర్` (2016), `అల వైకుంఠపురములో` (2020), `క్రాక్` (2021).. ఇలా తెలుగునాట ఇప్పటివరకు సంక్రాంతి సీజన్ లో ఏడు చిత్రాలతో సందడి చేశాడు యువ సంగీత సంచలనం తమన్. వీటిలో `బాడీగార్డ్`, `డిక్టేటర్` యావరేజ్ గా నిలవగా.. మిగిలిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అలా.. తమన్ కి సంక్రాంతి లక్కీ సీజన్ గా నిలిచిందనే చెప్పాలి.
అలాంటి లక్కీ సీజన్ లో 2022లోనూ `భీమ్లా నాయక్`తో తమన్ సందడి చేయాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో.. 2022 పొంగల్ కి తమన్ సినిమా రానట్టే అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా `రాధే శ్యామ్`తో రేసులోకి వచ్చాడీ `రేసు గుర్రం` కంపోజర్. కాకపోతే, ఈ పిరియడ్ రొమాంటిక్ సాగాకి బాణీలు కాకుండా కేవలం నేపథ్య సంగీతం అందిస్తున్నాడు తమన్. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన `రాధే శ్యామ్`కి సంబంధించి దక్షిణాది వెర్షన్స్ కి మాత్రమే బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు తమన్. ఏదేమైనా.. సంక్రాంతి సీజన్ లో కేవలం నేపథ్య సంగీతంతోనే రాబోతున్న తమన్ ఫస్ట్ ఫిల్మ్ `రాధే శ్యామ్`నే కావడం విశేషమనే చెప్పాలి.
మరి.. ఇంతవరకు ఫెయిల్యూర్స్ ఎరుగని ఈ సీజన్ లో.. `రాధే శ్యామ్`తోనూ తమన్ ఓ మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



