అక్టోబర్ 23 దాకా ఆ ఇద్దరు హీరోయిన్లు కటకటాల వెనకే!
on Oct 11, 2020
డ్రగ్స్ కేసులో చిక్కుకొని జైలుపాలైన ఇద్దరు హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేది జ్యుడిషియల్ కస్టడీని స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు పొడిగించింది. కోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ ఇద్దరూ అక్టోబర్ 23 వరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉండాల్సిందే. తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆ తారలు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, కావాలనుకుంటే వారు హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇప్పటిదాకా వారి కుటుంబాలు బెయిల్ కోసం హైకోర్టుకు అప్పీల్ చేయలేదు.
రాగిణి ద్వివేది ఇంటిపై రైడ్ చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం సెప్టెంబర్ 4న అరెస్ట్ చేశారు. అదే తరహాలో సంజన ఇంటిపై దాడిచేసిన సీసీబీ అధికారులు, తమ ఆఫీసులో ఆమెను ఇంటరాగేట్ చేసిన తర్వాత సెప్టెంబర్ 8న ఆమెను అరెస్ట్ చేశారు. మొదట సీసీబీ కస్టడీలో రిమాండ్ హోమ్‌లో ఉన్న ఆ ఇద్దరినీ, తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ పదిహేను రోజుల పాటు క్వారంటైన్ సెంటర్‌లోని సెల్ ఉన్న వారిని, తర్వాత ఒకే జైలుగదికి తరలించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
