మా నాన్న ఓ మామూలు నాన్నే.. సంజయ్ దత్ కూతురి మాట!
on Oct 8, 2020
సంజయ్ దత్ కూతురిగా తనేమీ ప్రత్యేకంగా ఫీలవననీ, తన తండ్రి కూడా మిగతా తండ్రుల్లాంటి వాడేననీ అంటోంది ఆయన మొదటిభార్య రిచా శర్మ కూతురు త్రిశాలా దత్. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో సంజయ్ దత్ కూతురిగా ఎలా ఫీలవుతుంటారు? అని ఒక ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నాకు మామూలుగానే అనిపిస్తుంటుంది. ఏ ఇతర తండ్రిలాగే ఆయన కూడా. ఆయనతో ఉన్నప్పుడు మా నాన్నతో ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంది. మీ నాన్నతో ఉన్నప్పుడు మీరెలా ఫీలవుతుంటారో దానికంటే భిన్నంగా నేనేమీ ఫీలవను. దాన్ని నేను విడమరచి చెప్పలేను అని తెలిపింది త్రిశాల.
న్యూయార్క్‌లో నివాసం ఉంటున్న ఆమె వయసు 32 సంవత్సరాలు. ఫోరెన్సిక్ సైన్స్‌లో ఆమె స్పెషలైజేషన్ చేసింది. ఆమె చిన్నతంలోనే తల్లి రిచా శర్మ చనిపోయింది. అందువల్ల ఆమె ఎప్పుడూ తల్లిదండ్రులతో కలిసి ఉండలేదు. దీనిపై ఓ అభిమాని ప్రశ్న సంధించాడు. మీ అమ్మానాన్నలతో కలిసి ఉండలేదని తలచుకుంటే ఏమనిపిస్తుంటుంది? అని అతనడిగాడు. ఫర్వాలేదు. నాకు ఊహ తెలిశాక నేనెప్పుడూ మా అమ్మానాన్నలతో కలిసి ఉన్న జ్ఞాపకం లేదు. కాబట్టి వాళ్లు లేకుండా జీవితం ఎలా కొనసాగించాననే ప్రశ్నకు నిజంగా నా దగ్గర జవాబు లేదు అని జవాబిచ్చింది త్రిశాల.