అప్పుడు ప్రాణం వదిలేస్తానంటున్న కంగనా రనౌత్
on Oct 8, 2020
బాలీవుడ్ భామలు కంగనా రనౌత్, స్వరా భాస్కర్ మధ్య మరోసారి ట్విట్టర్ వేదికగా వార్ మొదలైందని అనుకోవచ్చు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్య కాదు, ఆత్మహత్య అని ఎయిమ్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మొదలైన ఇన్‌డైరెక్ట్ వార్.
ఒకవేళ సుశాంత్ మర్డర్ మిస్టరీ విషయంలో తాను చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని నిరూపిస్తే... తనకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలు తిరిగి ఇచ్చేస్తానని గతంలో కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. సిబిఐ, ఎయిమ్స్ సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్య అని రిపోర్టు ఇచ్చాయి. ఆ సంగతి చెబుతూ... "కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇవ్వబోరు" అని స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. అందులో ఎక్కడా కంగనా పేరును ప్రస్తావించలేదు. కానీ, కంగనాను ఉద్దేశించి అన్నారని అందరికీ తెలుసు.
"మెమరీ వీక్ అయితే నా ఇంటర్వ్యూ మరోసారి చూడండి. నేను ఒక్క తప్పుడు ఆరోపణ చేసినా నా అవార్డులను తిరిగిస్తా. క్షత్రియ వాగ్దానం ఇది. నేను రాముడి భక్తురాలిని. ప్రాణాలైనా వదిలేస్తా గానీ మాట వదలను. జై శ్రీరామ్" అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. స్వరా భాస్కర్ పేరును ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, తన పేరు ప్రస్తావించకుండా స్వర చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చారని అర్థమవుతూ ఉంది. ఈ ఇన్‌డైరెక్ట్ వార్ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.
Also Read