జైలులో రియా చక్రవర్తి ఏం చేశారంటే?
on Oct 8, 2020
రియా చక్రవర్తి బుధవారం బెయిలు మీద జైలు నుంచి విడుదల అయ్యారు. అప్పటికి సుమారు 28 రోజులు ఆమె కారాగారంలో ఉన్నారు. మధ్యలో ఆమెను కలవడానికి వెళ్లిన వ్యక్తిగత లాయర్ సతీష్ జైలులో ఖైదీలకు రియా చక్రవర్తి యోగా నేర్పించారనీ, యోగా క్లాసులు నిర్వహించారని తెలిపారు.
రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు అయిన తర్వాత న్యాయం చిగురించిందని సతీష్ వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని తలపించిన పరిస్థితులతో రియా పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. రియా చక్రవర్తి జైలులో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్లానని సతీష్ తెలిపారు.
"జైలులో పరిస్థితులకు రియా అడ్జస్ట్ అయ్యారు. కరోనా మహమ్మారి వల్ల ఇంటి భోజనం తప్పించుకోవడానికి వీలులేకపోవడంతో పరిస్థితులకు తగ్గట్టు సర్దుకు పోయారు. ఆర్మీ కిడ్ కావడంతో క్రమశిక్షణతో ఉన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. జైలులో సహచరులకు యోగా క్లాసులు నిర్వహించారు" అని లాయర్ సతీష్ తెలిపారు. రియాక్ట్ బెయిలు వచ్చినప్పటికీ కఠినమైన షరతులు విధించారు. విదేశాలు వెళ్లకుండా పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవడంతో పాటు పది రోజుల పాటు ఆమె ఇంటికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ప్రతిరోజు హాజరుకావాలని ఆదేశించారు. వ్యక్తిగత పూచీకత్తు కింద ఒక లక్ష రూపాయలు సమర్పించమని కోరారు.