అఫిషియల్.. బాలయ్య సినిమాలో దునియా విజయ్!
on Jan 3, 2022

'అఖండ' సినిమాతో 2021 చివరిలో ఘన విజయాన్ని అందుకున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఒమిక్రాన్, సినిమా టికెట్ ధరల తగ్గింపు వంటి ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించిన కలెక్షన్స్ తో అఖండ విజయాన్ని అందుకుంది. అఖండ సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా కోసం మరింత ఎనర్జీతో పనిచేస్తున్నాడు.
2021 జనవరిలో రవితేజకు 'క్రాక్'తో సాలిడ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ రోల్ లో శాండల్ వుడ్ సెన్సేషన్ దునియా విజయ్ నటిస్తున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా మూవీ టీమ్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి జనవరి 5 ఉదయం 10:08 కి మరో కీలక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.

ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



