'రాధేశ్యామ్' వాయిదాపై క్లారిటీ వచ్చేసింది!
on Jan 3, 2022

జనవరి 7 న భారీ స్థాయిలో విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 14 న విడుదల కావాల్సిన మరో పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడే అవకాశముందని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా మూవీ టీమ్ ఈ వార్తలను ఖండించింది.
సెకండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ రీఓపెన్ కావడం, పలు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో మళ్ళీ సినీ పరిశ్రమకి మంచి రోజులు వచ్చాయని భావించారంతా. కానీ ఊహించని విధంగా కొద్దిరోజులుగా పరిస్థితి మారిపోయింది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాలలో థియేటర్స్ తాత్కాలికంగా మూత పడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి. ఈ ప్రభావం బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా మూవీలపై ఎక్కువగా పడుతుంది. ఈ క్రమంలోనే హిందీ జెర్సీ, ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డాయి. దీంతో రాధేశ్యామ్ విడుదలపై కూడా సందేహాలు నెలకొన్నాయి. అయితే మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్ కే వస్తామని చెబుతోంది.
రాధేశ్యామ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. రూమర్స్ నమ్మొద్దని, జనవరి 14 న థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



