నితిన్ రెస్టారెంట్లో సమంత రిసెప్షన్
on Nov 21, 2016
పీకల్లోతు ప్రేమలో మునిగి తేలి ఆ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి దాకా తీసుకువచ్చారు సమంత, నాగచైతన్య. వచ్చే ఏడాది వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో పెళ్లి వేదిక ఎక్కడ..? రిసెప్షన్ ఎక్కడ అనే విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, సెర్చ్ ఇంజిన్లలోనూ ఈ విషయాలపై తెగ సెర్చ్ చేస్తున్నారు అభిమానులు. అయితే మ్యారేజ్ వెన్యూ సంగతి పక్కనబెడితే..రిసెప్షన్ వెన్యూ ఎక్కడో తెలిసిపోయింది.
సమంత, చైతూల రిసెప్షన్ వేదిక హైదరాబాద్‌లోని టి-గ్రిల్స్ రెస్టారెంట్లో అట. ఈ విషయాన్ని స్వయంగా పెళ్లికూతురు, హీరోయిన్ సమంత స్వయంగా తెలిపింది. అసలు మ్యాటరేంటంటే రీసెంట్గా ఏర్పాటు చేసిన టి-గ్రిల్స్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా సమంత హాజరైంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ వివాహ రిసెప్షన్ ఇందులోనే జరుగుతుందని ప్రకటించింది. అందుకు కారణం ఈ రెస్టారెంట్ సమ్ బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ నీరజ కోన, ప్రముఖ నటుడు నితిన్ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేయడమే. సో ఇక తేలాల్సింది పెళ్లి ఎక్కడా అనేది.