రాజమౌళిని కాపీ కొడుతున్న శంకర్
on Nov 21, 2016
దక్షిణాదిన నెం.1 దర్శకుడు ఎవరంటే నిన్నా మొన్నటి వరకూ శంకర్ పేరు చెప్పేవారు. మిగిలిన వాళ్లంతా శంకర్‌ని కాపీ కొట్టేవాళ్లు. బాహుబలితో శంకర్ స్థానాన్ని దాటుకెళ్లిపోయాడు మన ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు శంకర్.. జక్కన్నని కాపీ కొట్టడం మొదలెట్టాడేమో అనిపిస్తోంది. బాహుబలి విజయంలో కీలక పాత్ర వహించింది.. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ. ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్లాడానికి రాజమౌళి పాటించిన వ్యూహాలు అద్భుతంగా ఫలించాయి. బాలీవుడ్‌లో బాహుబలి రూ.100కోట్లు తెచ్చుకొందంటే అదంతా రాజమౌళి తాలుకా పబ్లిసిటీ ట్రిక్కే. దాన్ని శంకర్ కాపీ కొట్టేశాడు.
రోబో 2.0 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ముంబైలో విడుదల చేయడానికి వెనుక శంకర్ లక్ష్యం ఒక్కటే. తన సినిమాని బాలీవుడ్‌లో ప్రచారం కల్పించాలని. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ రావడం ప్రాధాన్యం సంతరించుకొంది. పైగా 2.0లో ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్‌ని ఎంచుకొన్నారు. అక్షయ్ పోస్టర్‌తో బాలీవుడ్లో ఈ సినిమాని బాగా అమ్ముకొనే ఛాన్సుంది. పైగా రజనీకాంత్ కూడా ఈసినిమాలో నిజమైన హీరో అక్షయ్ కుమారే అని చెబుతున్నాడు. ఇదంతా బాలీవుడ్ మార్కెట్‌ని ఆకట్టుకోవడానికే. సేమ్ ఇలాంటి స్ట్రాటజీనే కబాలీ సినిమాకీ వాడారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి శంకర్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.