చైతూ - సమంత పెళ్లికి ఇది టీజర్ అనుకోవొచ్చా?
on Aug 29, 2016
ఓ ఉత్కంఠతకు తెరపడింది. ఓ బంధం.. వివాహంతో మరింత బలపడబోతోంది. అవును... చైతూ- సమంతల ప్రేమగాథ పెళ్లిపుస్తకంతో పరిపూర్ణం కాబోతోంది. ఈ పెళ్లికి నాగార్జున నుంచి గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. చైతూ - సమంతల పెళ్లికి నాగ్ ఒప్పుకొంటారా లేదా, నాగ్ అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతుందా? అనే సందేహాలకు తెరపడిపోయింది. చైతూ - సమంతలులవ్లో ఉన్న సంగతి తెలిసిందే.
వాళ్లేం నేరుగా చెప్పకపోయినా... టాలీవుడ్‌కి వీళ్ల లవ్ మేటర్ అర్థమైపోయింది. చైతూ, సమంతలు చాటు మాటుగా కనిపిస్తూ.. కెమెరాకు చిక్కడం, ఆ ఫొటోలు కొత్త సందేహాలు లేవనెత్తడం...చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఆఫీషియల్గానే ఓ పెళ్లికి హాజరయ్యారు. కొత్త జంటను జంటగా దీవించి వచ్చారు. అయితే అదే పెళ్లిలో నాగార్జున కూడా ఉన్నారు. సమంతతో ఆత్మీయంగా మాట్లాడారు. అఖిల్ కూడా.. సమంతతో సరదాగా ముచ్చటించాడు. మొత్తానికి ఫ్యామిలీ ఫొటోకి పోజులు ఇచ్చేశారు. దాంతో సమంత, చైతూల బంధానికి నాగ్ పచ్చజెండా ఊపారన్న సంగతి... బయట ప్రపంచానికి అఫీషియల్‌గా అర్థమైంది. డిసెంబరు 9న చైతూ - సమంతల పెళ్లి జరగబోతోందని టాక్. అయితే... ఈ విషయమై అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. జస్ట్... ఈ కలయిక చైతూ, సమంతల పెళ్లి ఓ టీజర్ అనుకోవొచ్చేమో? అసలు ట్రైలర్ అంటే నిశ్చితార్థం ముందుంది. చైతూ, సమంతల మేటర్ అధికారికంగా డిసైడ్ అయిపోయినట్టే.