బికారీ నెంబర్ వన్... పవన్
on Aug 29, 2016
పవన్ కల్యాణ్ ఎప్పుడు మైకు పట్టుకొన్నా... ఓ పాయింటు తప్పకుండా మాట్లాడతాడు. అదేంటో తెలుసా `నా దగ్గర డబ్బుల్లేవ్ మహాప్రభూ...` అంటూ బీద అరుపులు అరవడం మాత్రం మానుకోడు. సర్దార్ టైమ్‌లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో `డబ్బుల్లేవ్. కనీసం స్టాఫుకి కూడా జీతాలు ఇవ్వలేని పొజీషన్` అంటూ తానెంత బికారో అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు పవన్. ఇప్పుడ మరోసారి తన దగ్గర డబ్బుల్లేవని అందుకే సినిమాలు చేస్తున్నానన్న పాయింట్ బలంగా, గుది గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఓ స్టార్ హీరో.. తెలుగునాట అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే నటుడు, నిర్మాత... ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమిటో అర్థం కాదు. పవన్ దగ్గర నిజంగా డబ్బుల్లేవా, లేదంటే ఇదంతా డ్రామానా? తన దగ్గర డబ్బుల్లేవని తెలిస్తే.. ఫ్యాన్స్ మరింత కరిగిపోతారని పవన్ భావిస్తున్నాడా?
పవన్ దగ్గర డబ్బుల్లేవంటే ఫ్యాన్స్ వెర్రిగా నమ్మేస్తారేమోగానీ.. సామాన్య ప్రజానికం మాత్రం కాదు. ఎందుకంటే...పవన్ రెమ్యునరేషన్ రూ.20 కోట్లకు పైమాటే. పవన్ సై అంటే తనతో సినిమాలు చేయడానికి ఇప్పటికీ నిర్మాతలు వరుస కడతారు. అలాంటప్పుడు పవన్‌కి డబ్బుల కొదవేముంది? అన్నది జనాల మాట. మీరు సినిమాలు చూస్తేనే నాకు డబ్బులొస్తాయి.. గబ్బర్‌సింగ్ చూడలేదు - అందుకే డబ్బులు రాలేదు.. అంటూ పవన్ తన అభిమానుల్ని బ్లాక్ మెయిల్ చేయడం కూడా విడ్డూరంగా మారింది. తన స్పీచుల్లో ఇలాంటి కామెడీ లేకపోతే బాగుంటుంది. లేదంటే సీరియస్ విషయం కూడా నవ్వుల పాలైపోతుంది. ఈ విషయాన్ని పవన్ గుర్తించుకొంటే మంచిది.