చిరుతో తమన్నా... ఇది ఫిక్సండోయ్
on Aug 29, 2016
చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం రెండు నెలల పాటు అన్వేషించి చివరకు కాజల్‌తో సర్దుకుపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్సే లేదు. అలాంటప్పుడు తమన్నా ఎక్కడి నుంచి వచ్చింది అనుకొంటున్నారా? చిరుతో తమన్నా ఆడిపాడడం ఖాయం. అయితే.. హీరోయిన్ గా కాదు. ఐటెమ్ గాళ్‌గా. చిరు 150వ చిత్రం ఖైదీ నెం.150లో ఓ ప్రత్యేకగీతం ఉంది. ఆ పాట కోసం తమన్నాని ఎంచుకొన్నారని సమాచారం. చిరు హీరోయిన్ల లిస్టులో తమన్నా కూడా ఉంది. తనకు కాల్షీట్లు కుదరకపోవడం వల్ల డ్రాప్ అయ్యింది. అయితే ఐటెమ్ సాంగ్ అనగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకొందని సమాచారం. మెగా ఫ్యామిలీకి తమన్నా చాలా క్లోజ్. పవన్, చరణ్, బన్నీలతో కలసి నటించేసింది. ఇప్పుడు చిరుతో కూడా జోడీ కట్టబోతోందన్నమాట. చిరు సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ జరుపుకొంటోంది. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలెడతారు.