`ఫ్యామిలీ`కి హైలైట్ గా నిలిచిన సామ్!
on Jun 4, 2021

`ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది అక్కినేని సమంత. మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్`కి కొనసాగింపుగా రూపొందిన ఈ వెబ్-సిరీస్ లో.. విధివంచితురాలైన శ్రీలంక తమిళయన్ రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి పాత్రలో దర్శనమిచ్చింది సామ్. ఎనౌన్స్ మెంట్ నాటి నుంచే సీజన్ 2కి సమంత మెయిన్ ఎట్రాక్షన్ అవుతుందని అందరూ భావించారు. అంతా అనుకున్నట్టే.. ఈ రోజు (జూన్ 4) నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`కి హైలైట్ గా నిలిచింది సామ్. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ కి ఎన్నో సర్ప్రైజెస్ జోడించి.. సామ్ లోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించారు క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే.
మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ లో.. రెండో ఎపిసోడ్ లో సామ్ రోల్ ఎంట్రీ ఇస్తుంది. చివరి ఎపిసోడ్ వరకు కొనసాగుతుంది. కనిపించిన ప్రతీ సీన్ లోనూ తన నటనతో మెస్మరైజ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా.. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్ పాయ్) అండ్ టీమ్ రాజీని ఖైదు చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు.. సామ్ చేసే స్టంట్స్, విన్యాసాలు అబ్బురపరుస్తాయి. అలాగే, కొన్ని సన్నివేశాల్లో తన హిందీ డబ్బింగ్ తోనూ ఆకట్టుకుంది సామ్. ఇక ఆరంభ ఎపిసోడ్స్ లో తనని లైంగికంగా వేధించే వారిని తుదముట్టించే సీన్స్ లోనూ సమంత యాక్టింగ్ కట్టిపడేస్తుంది. మొత్తమ్మీద.. సామ్ డిజిటల్ డెబ్యూ అదిరిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



