బన్నీని ఆకాశానికెత్తేస్తూ ఊహించని కామెంట్స్ చేసిన సమంత!
on Dec 20, 2021

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తూ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ నటనపై ప్రశంసలు వ్యక్తమవున్నాయి. బన్నీ కెరీర్ లోనే ఇది బెస్ట్ పర్ఫామెన్స్ అని, తన అద్భుత నటనతో సినిమాని నిలబెట్టాడని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సినిమాలో 'ఊ అంటావా మావ' అనే స్పెషల్ సాంగ్ తో అలరించిన సమంత కూడా బన్నీని ఆకాశానికి ఎత్తేస్తోంది.
'పుష్ప' సినిమాలో బన్నీ నటనని ప్రశంసిస్తూ తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. "పుష్ప మూవీలో బన్నీ ప్రతిక్షణం ప్రేక్షకులను కట్టిపడేసేలా నటించారు. ఒక యాక్టర్ అసాధారణ నటన కనబరిస్తే.. ఆ నటన నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతాను. పుష్ప మూవీలో భుజాన్ని వేలాడేస్తూ బన్నీ కనబరిచిన అద్భుతమైన నటన నిజంగా స్ఫూర్తిదాయకం." అంటూ సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఒక స్టార్ ని ఈ స్థాయిలో పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బన్నీ అద్భుత నటనే సమంతని ఇలా మాట్లాడేలా చేసింది అంటూ బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్'లో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



